మా అబ్బాయికి నేను అపకారం చేశాను
on May 21, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)జూన్ 12 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. పవన్ ఫస్ట్ టైం చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడంతో పాటు, పోరాట యోధుడు గా పవన్ చేస్తుండటంతో వీరమల్లు పై ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మెగా సూర్య మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత ఏఏం రత్నం(Am rathnam)వీరమల్లు ని నిర్మించగా, ఆయన తనయుడు జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకుడిగా వ్యవహరించాడు.
రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన 'అసుర హననం' అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో నిర్మాత ఏఏం రత్నం మాట్లాడుతు' వేదాళం సినిమాని కళ్యాణ్ గారు మా అబ్బాయి డైరెక్షన్ లో తెరకెక్కిద్దామని చెప్పారు. కానీ జ్యోతి కృష్ణ అప్పుడు ఆక్సిజన్ సినిమాని డైరెక్ట్ చేస్తు బిజీగా ఉన్నాడు. దాంతో కళ్యాణ్ గారు ఇచ్చిన ఆఫర్ ని జ్యోతి కృష్ణకి చెప్పలేదు. ఒక విధంగా తనకి నేను అపకారం చేసినట్టు. మా అబ్బాయి అని చెప్పడం కాదు, వీరమల్లు బాగా రావడం కోసం ఎన్నో రాత్రులు నిద్రమానుకొని ఎంతో తపనతో జ్యోతికృష్ణ తెరకెక్కించాడు. మా అబ్బాయి డైరెక్షన్ చూసి కళ్యాణ్ గారే ఎంతో ఆశ్చర్యపడ్డారని చెప్పుకొచ్చాడు.
హీరోయిన్ నిది అగర్వాల్(Nidhhi Agerwal)తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani)దర్శకుడు జ్యోతికృష్ణ తదితరులు కూడా సినిమాకి సంబంధించిన పలు ఆసక్తి కర విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వీరమల్లు సందడి చేయనుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



