'అల్లుడు అదుర్స్'.. 90 శాతం పూర్తి!
on Dec 22, 2020
'రాక్షసుడు' రూపంలో కెరీర్ లో తొలిసారి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. 'అల్లుడు అదుర్స్'లో నటిస్తున్నాడు. 'కందిరీగ', 'రభస', 'హైపర్' చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సాయిశ్రీనివాస్ కి జంటగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది. అను ఇమ్మాన్యుయేల్ మరో నాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ప్రకాష్ రాజ్, సోనూ సూద్ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు 90 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. త్వరలోనే బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'అల్లుడు అదుర్స్'కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ డెబ్యూ మూవీ 'అల్లుడు శీను'కి కూడా తనే స్వరకర్త కావడం గమనార్హం.
Also Read