నైనికా తో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్.. నైనికా ఎవరో తెలుసా!
on Oct 1, 2025

అగ్ర నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind)తనయుడిగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)సోదరుడిగా సినీ రంగ ప్రవేశం చేసాడు అల్లు శిరీష్. హీరోగా తన ఖాతాలో మంచి విజయాలు ఉన్నాయి. గత ఏడాది ఫాంటసీ యాక్షన్ ఫిలిం 'బడ్డీ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రానికి కమిట్ అవ్వలేదు.
రీసెంట్ గా అల్లు శిరీష్(Allu Sirish)'ఎక్స్'(X)వేదికగా స్పందిస్తు నేడు మా తాతయ్య 'అల్లు రామలింగయ్య(Allu ramalingaiah)గారి జయంతి సందర్భంగా నా మనసుకి దగ్గరైన ఒక న్యూస్ చెప్తున్నాను. నా నిశ్చితార్థం ఈ నెల 31 న నైనికాతో జరగబోతుంది. మా నానమ్మ ఇటీవల మరణించింది. ఆమె నా పెళ్లి చూడాలని అనుకునేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మా కుటుంబాలు మా ప్రేమని ఆనందంతో స్వీకరించాయి అని తెలిపాడు. పారిస్ దేశంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'ఈఫిల్ టవర్' వద్ద నైనికా చేయి పట్టుకొని ఉన్న ఫోటోని కూడా షేర్ చేసాడు. దీంతో నైనికా ఎవరనే చర్చ అభిమానులతో పాటు నెటిజన్స్ లో జరుగుతుంది.
హాస్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన 'అల్లురామలింగయ్య' గారు 1922 అక్టోబర్ 1 న ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా 'పాలకొల్లు'లో జన్మించారు. అల్లు శిరీష్ మూడవ మనవడు.2013 లో గౌరవం అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన శిరీష్ ఇప్పటి వరకు సుమారు ఎనిమిది చిత్రాల వరకు చేసాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



