చంచల్ గూడ జైలుకి భారీగా చేరుకుంటున్నఅల్లు అర్జున్ ఆర్మీ..పరిస్థితి ఉద్రిక్తం
on Dec 13, 2024

పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సంభవించిన మహిళ మరణంపై అల్లు అర్జున్(allu arjun)ని అరెస్ట్ చేసిన సంఘటన ఇప్ప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.ఇక ఈ కేసులో అల్లు అర్జున్ కి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ ని విధించగా పోలీసులు అల్లు అర్జున్ ని చెంచల్ గూడ జైలుకి తరలించడం జరుగుతుంది.
దీంతో చంచల్ గూడ జైలు వద్దకు అల్లు అర్జున్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. జై బన్నీ అంటూ ఆ ప్రాంగణం మొత్తం దద్దరిలిపోయేలా చేస్తున్నారు. ఇక ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కూడా అభిమానులని అక్కడ నుంచి పంపివేస్తున్నా కూడా మళ్ళీ అంతకంత అభిమానులు పెరుగుతూ వస్తుండంతో ఆ ఏరియా మొత్తం భారీగాట్రాఫిక్ జామ్ అయ్యింది.ఇక అల్లు అర్జున్ తన అభిమానులని ఆర్మీ అని పిలుచుకుంటాడనే విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



