అల్లుఅర్జున్ కి గాంధీ హాస్పిటల్ లో వైద్యపరీక్షలు..ఆ తర్వాత ఏంటి
on Dec 13, 2024
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలవడానికి కారణమయ్యాడనే కారణంతో అల్లు అర్జున్ ని ఆయన ఇంటి దగ్గర పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్ కి తరలించిన విషయం తెలిసిందే.
పిఎస్ లో అల్లు అర్జున్(allu arjun)ని సెంట్రల్ జోన్ డిసిపీ విచారించగా,ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీంతో అల్లుఅర్జున్ ని కోర్టు కి తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఇక ఈ కేసు పై సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని అల్లు అర్జున్ తరుపు లాయర్లు వేసిన పిటిషన్ పై మరికాసేపట్లలో తీర్పు రానుంది. అల్లు అర్జున్ కోసం సినీ పరిశ్రమకి చెందిన పలువురుచేరుకుంటున్నారు. ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు(dil raju)కూడా అక్కడ వెయిట్ చేస్తున్న వారిలో ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service




