అల్లు అర్జున్ లో మూడో కోణం కూడా ఉందా! మరి ఫ్యాన్స్ ఏమంటారు
on May 20, 2025
.webp)
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun)తన ప్రీవియస్ మూవీ 'పుష్ప 2'(Pushpa 2)తో పాన్ ఇండియా లెవల్లో సృష్టించిన సంచలనం తెలిసిందే. కలెక్షన్స్ పరంగా కూడా ఇండియన్ సినిమాకి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసాడు. దీంతో 'అట్లీ'(Atlee)తో తెరకెక్కబోతున్న మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు. విజువల్ ఎఫెక్ట్ కి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు షూటింగ్ కి వెళ్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
అల్లుఅర్జున్ రెండు విభిన్నమైన క్యారక్టర్ లలో కనిపించబోతున్నాడనే టాక్ గత కొన్ని రోజులుగా వినిపిస్తు వస్తుంది. అల్లు అర్జున్ ఇంతరకు చేసిన సినిమాల్లో ఒక్క' దువ్వాడ జగన్నాధం' తప్ప అన్ని సినిమాల్లోను సింగల్ క్యారక్టర్ లో మాత్రమే కనపడ్డాడు. దీంతో అట్లీ మూవీలో రెండు పార్శ్యాలు ఉన్న క్యారెక్టర్స్ అనే సరికి, ఎటువంటి క్యారక్టర్ లో అల్లు అర్జున్ కనపడతాడనే ఆసక్తి ఏర్పడింది. కానీ రీసెంట్ గా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం, అల్లు అర్జున్ రెండు క్యారక్టర్ లలో కాకుండా, మూడు విభిన్న క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. దీంతో అట్లీ, అల్లుఅర్జున్ మూవీపై అందరిలో అంచనాలు మరింతగా పెరిగాయి. సదరు క్యారెక్టర్స్ ఏమై ఉంటాయనే క్యూరియాసిటీ కూడా మొదలైంది.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు తెరకెక్కని ఒక సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుండగా, జులై చివరలో గాని లేదా ఆగస్టు మొదటివారంలో గాని షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన లెజండ్రీ నటులతో పాటు విదేశీ నటులు నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముగ్గురు హీరోయిన్లు అల్లు అర్జున్ తో జత కట్టబోతున్నారనే వార్తల నేపథ్యంలో దీపికా పదుకునే(Deepika Padukune)మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)జాన్వీ కపూర్(Janhvi Kapoor)పేర్లని చిత్ర యూనిట్ పరిశీలిస్తుందనే టాక్ ఉంది. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Pictures)అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



