బాలీవుడ్ భామతో బన్ని!!
on Apr 15, 2019
![]()
అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం `ఐకాన్`. కనబడుట లేదు అనేది ట్యాగ్ లైన్. ఫేమస్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఆర్య, పరుగు ,ఎవడు, దువ్వాడజగన్నాథ్ తర్వాత బన్నీ- రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. కాగా బన్నీ బర్త్ డే సందర్బంగా ఏప్రిల్ 8న విడుదల చేసిన ఐకాన్ ప్రీ లుక్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే ఈ సినిమాలో బన్నీ తొలిసారిగా డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వేణు శ్రీ రామ్ బన్నీ ఎనర్జీకి సరిపడేట్టు ఈ డ్యూయెలో రోల్స్ ని మలిచాడనీ సినిమాలో ఇదే ప్రత్యేకత ఆకర్షణగా నిలిచే అంశమని టాలీవుడ్ టాక్. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ అల్లు అర్జున్ డబుల్ రోల్ చేసిన సందర్భం లేదు. కాబట్టి ఈ చిత్రానికి అదే యూనిక్ పాయింట్ అవుతుందని సమాచారం.. అంతేకాదు ఈ సినిమాలో బన్నీకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని నటింపజేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభించి 2020 దసరాకి సినిమాని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



