అల్లు అర్జున్ డ్యూయల్ రోల్- రెహమాన్ మ్యూజిక్
on Jul 18, 2018
అల్లు అర్జున్ ఇప్పుడు మాంచి జోరు మీద ఉన్నాడు. ఈ మెగావారి అబ్బాయి వరుసగా మూడు బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీసు దుమ్ము దులిపేశాడు. అర్జున గత మూడు సినిమాలు- సరైనోడు, డీజే, నా పేరు సూర్య సినిమాలూ మూడూ హిట్ టాక్ తెచ్చేసుకున్నాయి. తాజాగా అర్జున్, మనం సినిమా ఫేమ్ విక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చేసేందుకు ఏకంగా హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లు వస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే... ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడట. ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో వేచి చూడాల్సిందే మరి!