అతి త్వరలోనే పాలిటిక్స్‌లోకి అల్లు అర్జున్..!
on Aug 6, 2018

అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఆర్యతో స్టైల్ మార్చి, స్టైలిష్ స్టార్ అనిపించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు.. తన ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు దగ్గరైన అల్లు అర్జున్, త్వరలో పొలిటీషియన్ గా మారనున్నాడు.. మీరు అనుకుంటున్నట్టు నిజజీవితంలో కాదులేండి, సినీ జీవితంలో.. అల్లు అర్జున్ గత చిత్రం 'నా పేరు సూర్య' ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు .. దీంతో అల్లు అర్జున్ తన తరువాతి సినిమా గురించి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.. ఇప్పటికే పలు కథలు విన్న ఆయన, ఇంతవరకు ఏ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. అయితే తాజాగా అల్లు అర్జున్ ఒక కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడట.. సంతోష్ రెడ్డి అనే నూతన దర్శకుడు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ కథను అల్లు అర్జున్ కి వినిపించాడట.. కథ ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో అల్లు అర్జున్ దీనికి ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది.. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలో అల్లు అర్జున్ ని పొలిటీషియన్ గా చూస్తామన్నమాట.. చూద్దాం అల్లు అర్జున్ పొలిటీషియన్ గా ఎలా ఆకట్టుకుంటారో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



