విధి ఏంటి బన్నీతో ఇలా ఆడుకుంటుంది
on Jul 5, 2017

అల్లు అర్జున్ ఈ మధ్య ఏది చేసినా వివాదం అవుతుంది. ఎప్పుడయితే, పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో పెట్టుకున్నాడో అప్పటి నుండి తలనొప్పులు మొదలయ్యాయి. బన్నీ ఏ ఫంక్షన్ కి వచ్చినా రచ్చ చేయడం... అతడి సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదలయితే డిస్ లైకులు కొట్టడం... ఇదే పనిగా పెట్టుకున్నారు ఒక వర్గం. దువ్వాడ జగన్నాధం కి విపరీతమయిన నెగటివ్ టాక్ రావడానికి... ఆ సినిమా నెట్ లో లీక్ అవ్వడానికి కూడా కారణం ఇదే బ్యాచ్ అని బన్నీ అభిమానుల సందేహం. ఇన్ని తలనొప్పుల మధ్య డీజే ని ప్రమోట్ చేయడానికి మరియు నాట్స్ ఈవెంట్ కి అటెండ్ అవ్వడానికి అల్లు అర్జున్, ఇతర డీజే యూనిట్ తో పాటు అమెరికా వెళ్ళాడు. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనే విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ కొందరి కథనం ప్రకారం అల్లు అర్జున్ ఈవెంట్ నిర్వాహకులకు చుక్కలు చూపించాడట. తనకి స్టార్ హోటలే కావాలని డిమాండ్ చేసాడట.
ఈవెంట్ కి వచ్చిన ఆహుతులని ఎక్కువ సమయం వెయిట్ చేయించిన బన్నీ, కేవలం ఇరవై నిమిషాలే మాట్లాడాడట. తర్వాత అక్కడ వచ్చిన అభిమానులతో ఎక్కువ సమయం కేటాయించకుండా త్వరగా వెళ్ళిపోయాడట. కొందరు ఈ విషయమై బన్నీ పై అసహనం వ్యక్తం చేస్తున్నారని వినికిడి. ఈ మధ్య బన్నీ నెంబర్ వన్ హీరో లా ఫీల్ అవుతున్నాడని, మెగాస్టార్ బిరుదు తగిలించుకునేంత ఎదిగాడని విమర్శలు వస్తున్నాయి. మీడియా తో గాని, అభిమానులతో గాని మునుపటిలా ఉండట్లేదని అంటున్నారు. బన్నీ కొన్ని కావాలని చేస్తున్నాడా, లేదా విధి ఆయనతో ఆడుకుంటుందో తెలియదు కానీ ఏది చేసినా వివాదాల పాలు అవుతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



