AA22: కళ్లుచెదిరే ధరకి అల్లు అర్జున్ మూవీ ఓటీటీ డీల్.. బడ్జెట్ లో 60 శాతం వచ్చేసింది!
on Dec 29, 2025

'పుష్ప-2'తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఎన్నో సంచలనాలు సృష్టించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి.. హిందీ గడ్డ మీద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు, ఓటీటీ డీల్ పరంగానూ రికార్డు సృష్టించింది. 'పుష్ప-2' ఓటీటీ రైట్స్ ని అప్పుడు నెట్ ఫ్లెక్స్ రూ.275 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ ఫిల్మ్.. అంతకుమించిన సంచలనాలకు రెడీ అవుతోంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత బడ్జెట్ అయినప్పటికీ.. సన్ పిక్చర్స్ లో ఎటువంటి ఆందోళన లేదు. దానికి కారణం.. కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే 60 శాతం బడ్జెట్ రికవర్ అవుతుందట. (AA22)
అల్లు అర్జున్-అట్లీ ఫిల్మ్ యొక్క అన్ని భాషల ఓటీటీ రైట్స్ కి కలిపి ఏకంగా రూ.600 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లెక్స్ అంగీకారం తెలిపిందట. ఈ మేరకు సన్ పిక్చర్స్, నెట్ ఫ్లెక్స్ మధ్య డీల్ కుదిరినట్లు సమాచారం.
Also Read: 2025 రౌండప్.. సర్ ప్రైజ్ చేసిన కొత్త దర్శకులు.. మీ ఫేవరెట్ ఎవరు?
'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్, 'జవాన్' తర్వాత అట్లీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. దీపికా పదుకొనే, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కోసం రూ.600 కోట్లు చెల్లించడానికి రెడీ అయినట్లు వినికిడి. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఇదే హైయెస్ట్ ఓటీటీ డీల్ కావడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



