అల్లు అర్జున్ గ్యాప్‌కి కారణం అరవిందే!
on Jan 13, 2020

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా 2018 మే నెలలో విడుదలైంది. ఆ సినిమా తర్వాత మళ్లీ అల్లు అర్జున్ థియేటర్లలోకి వచ్చింది ఈ సంక్రాంతికే. 'అల... వైకుంఠపురములో' సినిమాతోనే. ఆల్మోస్ట్ ఏడాదిన్నర తర్వాత అల్లు అర్జున్ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'నా పేరు సూర్య...' షూటింగ్ పూర్తయ్యాక 'అల..' షూటింగ్ స్టార్ట్ చేయడానికి మధ్యలో ఏడాది పాటు అల్లు అర్జున్ ఖాళీగా ఉన్నాడు. ఈ గ్యాప్ కి కారణం ఎవరో తెలుసా? అల్లు అరవింద్. ఈ సంగతి ఆయనే స్వయంగా చెప్పారు.
'అల... వైకుంఠపురములో' ఆదివారం విడుదలైంది. అదే రోజు సాయంత్రం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఆయన్ను 'అల్లు అర్జున్ కి గ్యాప్ వచ్చినప్పుడు మీరు ఏమన్నారు?' అని అడగ్గా.... 'నేను ఏమీ అనలేదు. నన్నే అల్లు అర్జున్ అనాలి. ఎందుకంటే... అల్లు అర్జున్ కాల్ షీట్స్ నా దగ్గరే ఉన్నాయి. సరైన స్టోరీ, సరైన డైరెక్టర్ సెట్ చేయనందుకు నన్నే బన్నీ ఏమైనా అనాలి. నేను ఏమంటాను?" అని సమాధానం ఇచ్చారు. 'అల...' విజయానికి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



