అల్లరోడి సరసన అరుంధతి!
on Jul 20, 2016
అల్లరి నరేష్ సరసన అరుంధతి అనగానే జేజమ్మ అనుష్క హీరోయిన్ గా నటించేస్తుందా? అని ఫిక్స్ అయిపోకండి. ఇక్కడ అరుంధతి అనగా మన అనుష్క కాదు తమిళ నటి. తమిళం మరియు కన్నడ భాషల్లో దాదాపు 15 సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న నటీమణి అరుంధతి. జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఇంట్లో దెయ్యం నాకేం భయం" అనే సినిమాలో అరుంధతి టైటిల్ పాత్రలో కనిపించనుంది. టైటిల్ పాత్ర అంటే అర్ధమయ్యిందిగా.. నరేష్ ఇంట్లో ఉండే దెయ్యం ఈ అరుంధతే అన్నమాట. షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం రెండో షెడ్యూల్ నుంచి అరుంధతి పాల్గొంటుంది. ఇకపోతే.. వరుసగా అరడజను ఫ్లాపుల తర్వాత ఎన్నో అంచనాల నడుమ విడుదలైన "సెల్ఫీ రాజా" కూడా దారుణంగా విఫలమవ్వడంతో.. ఈ హారర్ కామెడీతోనైనా ఒక్కటంటే ఒక్క హిట్టైనా కొట్టాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట అల్లరి నరేష్. అందుకే కథ, కథనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడని సమాచారం!