ప్రభాస్ వర్సెస్ అలియా!
on Feb 24, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ - ఇండియా మూవీ `రాధేశ్యామ్` జూలై 30న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రీవియస్ మూవీ `సాహో`.. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాన్ని సాధించకపోయినా, హిందీనాట మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో.. అక్కడ ఈ సారి కూడా తమ అభిమాన కథానాయకుడు వసూళ్ళ వర్షం కురిపిస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే, అదే జూలై 30న మరో క్రేజీ ప్రాజెక్ట్ హిందీనాట సందడి చేయనుంది. ఆ చిత్రమే.. `గంగూభాయ్ కథియావాడి`.
యంగ్ సెన్సేషన్ అలియా భట్ ప్రధాన పాత్రలో వెటరన్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయడమే కాకుండా జూలై 30న ఈ సినిమా థియేటర్స్ లోకి రానుందటూ ప్రకటించారు. దీంతో.. `రాధేశ్యామ్` వర్సెస్ `గంగూభాయ్` అన్నట్లుగా వాతావరణం నెలకొంది. మరి.. ప్రభాస్, అలియా భట్ చిత్రాల మధ్య సాగనున్న ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.