అక్ష కోరిక తీర్చేదెవరు?
on May 16, 2015

టాలీవుడ్ దర్శకనిర్మాతల వీక్ నెస్ ను వాడుకునే పనిలో పడిందట అక్ష. అదేనండీ ఆఫర్ల కోసం మన అమ్మాయిలు తిరిగితే పట్టించుకోరు కానీ అలా కోలీవుడ్ ని చుట్టేసి వస్తే హారతి పట్టేస్తారు గా. ఇప్పుడా పనిలోనే పడిందట ఈ పొట్టిపిల్ల. తెలుగులో ఆమె నటించిన అరడజను సినిమాల్లో 'యువత', 'రైడ్', 'కందిరీగ' హిట్టయ్యాయి. కానీ లక్కు కలసిరావద్దూ...! అమ్మడు కాస్త పొట్టిగా ఉండడం ఆమధ్య లావుగా తయారవడంతో మా కొద్దు తల్లోయ్ అన్నారు. దీంతో చాలామందిలానే కోలీవుడ్ కి ఎగిరిపోయింది. తమిళంలో నటించిన సలీమ్ సూపర్ హిట్టవడంతో...ఈ ఊపులో టాలీవుడ్ కి వెళితే ఛాన్సులొస్తాయిలే అనుకుందట. రావడమే తడవు రవితేజ బెంగాల్ టైగర్లో గెస్ట్ అపియరెన్స్, శ్రీకాంత్ సరసన మరోఛాన్స్ కొట్టేసింది. ఆరంభం అదిరిందిలే అని అమ్మడు ఫీలవుతున్నా నీ కంత సీన్ లేదులే అని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. మరి రీ ఎంట్రీలోనైనా అక్ష కోరిక తీరుతుందా?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



