'బ్యాచిలర్'గా అఖిల్?
on Feb 3, 2020
టాలీవుడ్ బ్యాచిలర్ హీరోల్లో అఖిల్ అక్కినేని ఒకడు. కరెక్టుగా చెప్పాలంటే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అని చెప్పాలి. కింగ్ నాగార్జున, అమలు దంపతుల ముద్దుల కుమారుడు... స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవడు... అందగాడు... బోల్డంత ఆస్తికి వారసుడు... అమ్మాయిల్లో విపరీతమైన క్రేజు ఉన్నవాడు... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాకపోతే ఇంకేం అవుతాడు? అందుకే అతడి తాజా సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేశారట.
అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టైటిల్ ఖరారు చేశారట. అందులో 'బ్యాచిలర్' అనే పదాన్ని హైలెట్ చేస్తున్నారని సమాచారం. మంగళవారం సాయంత్రం ఈ టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవల గీతా ఆర్ట్స్ సంస్థ పై వచ్చిన సినిమాలు దాదాపుగా విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అక్కినేని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సినిమా విజయం సాధించడం అఖిల్ అక్కినేనికి చాలా కీలకం.
Also Read