అఖిల్ టార్గెట్ అదే!
on Jul 23, 2015
.jpg)
తొలి సినిమాతోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరితే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకూ ఏ హీరోకీ సాధ్యం కాని రికార్డ్ ఇది. రామ్‌చరణ్ తొలి సినిమా చిరుత హిట్ అయినా.... వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించలేకపోయింది. నాగచైతన్య జోష్‌కీ ఆ అవకాశం లేకుండా పోయింది. సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లు ఈ మ్యాజిక్ కి చాలా దూరంలో నిలబడిపోయారు. ఇప్పుడు ఆ ఛాన్స్ అఖిల్‌కి దక్కబోతోంది. అఖిల్ - వినాయక్ సినిమాపై ఇండ్రస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా వసూళ్ల దుమ్ము దులపడం ఖాయమని ట్రేడ్ పండితులు అప్పుడే విశ్లేషణలకు దిగిపోతున్నారు.
వినాయక్ మార్క్ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్సయి.. జస్ట్ ఓకే అనుకొన్నా ఈ సినిమా రూ.50 కోట్లు కొల్లకొట్టేయడం ఖాయమని లెక్కలు వేస్తున్నారు. అఖిల్ టార్గెట్ కూడా అదే. పబ్లిసిటీ పక్కాగా చేసుకొని, మాంచి హైప్ క్రియేట్ చేసి, ఓపెనింగ్స్ భారీగా రాబడితే.. రూ.50 కోట్లు పెద్ద కష్టమేమీ కాదని అఖిల్ నమ్మకం. నితిన్ కూడా అదే ధీమాతో ఈసినిమాకి భారీగా ఖర్చు పెడుతున్నాడని టాక్. మరి అఖిల్ తొలి సినిమాకే రూ.50 కోట్లు హీరో అవుతాడో, లేదో తెలియాలంటే. ఇంకొంత కాలం ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



