అఖండ 2 ఆ థియేటర్ లో ఎన్నిరోజులు ఆడవచ్చు.. ఫ్యాన్స్ కోరిక తీరుతుందా!
on Nov 11, 2025

-అఖండ 2 ఆ థియేటర్ లో ఎన్ని రోజులు ఆడుతుంది!
-లెజెండ్ 1000 రోజులు ఆడిన థియేటర్ ఏది!
-అఖండ 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు
-త్వరలోనే వరుస ప్రమోషన్లు
'వింటే భారతం వినాలి..తింటే గారెలు తినాలి.. సినిమా అంటు చూస్తే బాలయ్య(Balayya),బోయపాటి(Boyapati Srinu)కాంబోలో సినిమా చూడాలనే సామెత అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో చాలా బలంగానే ఉంది. అందుకు తగ్గట్టే సినిమా సినిమాకి తమ కాంబో రేంజ్ ని పెంచుకుంటు వస్తున్నారు. ఎంతలా అంటే ఒక సినిమా వంద రోజులు రెండు వందల రోజులు ఆడటం అనేది ప్రేక్షకులతో పాటు సిల్వర్ స్క్రీన్ ఎప్పుడో మరిచిపోయింది. కానీ ఈ ఇద్దరి కాంబో మాత్రం ప్రేక్షకులకి, సిల్వర్ స్క్రీన్ కి ఆ పండుగల్ని గుర్తు చేస్తుంది. వంద, రెండు వందల రోజులే కాదు వెయ్యి రోజుల ఆడటం దాకా ఆ పండుగని తీసుకెళ్లారు.
అందుకు బీజం వేసిన మూవీ లెజెండ్(Legend). మార్చి 28 2014 న థియేటర్స్ లలో అడుగుపెట్టిన ఈ మూవీ రన్నింగ్ పరంగా తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్ లో 1000 రోజులు రన్నింగ్ అయ్యి బాలయ్య కి రాయలసీమలో ఉన్న చరిష్మా ఏ పాటిదో తెలియచేసింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఇంత వరకు ఎవరు టచ్ చెయ్యని రికార్డు అని కూడా చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు అభిమానుల దృష్టి బాలయ్య, బోయపాటి అప్ కమింగ్ మూవీ అఖండ 2(Akhanda 2)పై పడింది. ఈ మేరకు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు 'అఖండ 2 ని బాలయ్య, బోయపాటి ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని నిర్మిస్తున్నారు.
Also read: ఎవర్ గ్రీన్ హీరో ధర్మేంద్ర అస్తమయం. ప్రముఖుల నివాళి
ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమా కూడా ఎంతో బాగా వస్తుందని, అఖండ మొదటి భాగాన్ని మించి తెరకెక్కుతోందని మేకర్స్ పలు సందర్భాల్లో చెప్తు వస్తున్నారు. పైగా మూవీ డేవోషనల్ కంటెంట్ తో వస్తుంది. ప్రస్తుతం డేవోషనల్ కంటెంట్ కి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. దీనికి బాలయ్య, బోయపాటి కాంబో యాడ్ అయ్యింది. దీంతో ప్రొద్దుటూరు అర్చన థియేటర్ లో లెజెండ్ రన్నింగ్ డేస్ రికార్డుని పార్ట్ 2 బద్దలు కొట్టడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో అభిమానుల కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



