Akhanda 2: బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా అఖండ-2
on Dec 15, 2025

బాలయ్య బాక్సాఫీస్ గర్జన
మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో అఖండ-2
సోమవారం సాలిడ్ బుకింగ్స్
'అఖండ-2'తో నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ దగ్గర గర్జించారు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. వరుసగా ఐదోసారి బాలకృష్ణ ఈ ఫీట్ సాధించడం విశేషం. (Akhanda 2 Thaandavam)
2021లో వచ్చిన 'అఖండ'తో బాలయ్య హిట్ స్ట్రీక్ మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఇప్పుడదే బాటలో 'అఖండ-2' పయనించింది.
అఖండ-2 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. రెండో రోజు, మూడో రోజు కలిపి మరో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
Also Read: 'ధురంధర్' బాక్సాఫీస్ ఊచకోత.. పది రోజుల్లో 550 కోట్లు..!
ఇప్పట్లో అఖండ-2 జోరుకి బ్రేకులు పడేలా లేవు. నాలుగో రోజైన సోమవారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. బుక్ మై షోలో గంటకు ఐదు వేలకు తగ్గకుండా టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే.. ఈ మూవీ మండే టెస్ట్ పాస్ అయినట్లే.
వీక్ డేస్ లో నిలబడిందంటే.. సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. ప్రస్తుత బుకింగ్స్ చూస్తుంటే.. అఖండ-2 కి లాంగ్ రన్ ఉండటం ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.150-200 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది. దాంతో అఖండ-2 బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



