బాలకృష్ణ అరుదైన రికార్డు..ఇది మా బాలయ్యకి మాత్రమే సాధ్యం
on Jun 10, 2025
గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ 'నందమూరి బాలకృష్ణ'(Nandamuri Balakrishna)అప్ కమింగ్ మూవీ అఖండ 2 (Akhanda 2). బాలయ్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అఖండ కి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతుండటంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు మరింత పెరిగేలా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నిన్న అఖండ 2 టీజర్ రిలీజయ్యింది.
నిమిషం పద్దెనిమిది సెకన్ల నిడివితో ఉన్న టీజర్, రిలీజైన ఇరవై నాలుగు గంటలోనే 22 మిలియన్ల వ్యూస్ పైగా రాబట్టింది. దీంతో రాబోయే రోజుల్లో యూట్యూబ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా అఖండ 2 దూసుకుపోవడం ఖాయమని అర్ధమవుతుంది. అభిమానులైతే ఇలాంటి రికార్డులు సృష్టించడం మా బాలయ్యకి మాత్రమే సాధ్యమంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఇక టీజర్ గురించి చెప్పుకుంటే అఘోర గెటప్ తో హిమాలయ పర్వతాల్లో ఉన్న బాలయ్య దుష్ట శక్తులతో పోరాడే విధానం, డైలాగ్స్, థమన్ బిజిఎమ్ చూస్తుంటే రేపు థియేటర్స్ లో అఖండ పార్ట్ 1 కంటే రెట్టింపుగా బాక్స్ లు బద్దలు కాబోతున్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. బాలయ్య నట విశ్వరూపంలో దాగి ఉన్న మరో కొత్త కోణాన్ని కూడా చూపించబోతున్న అఖండ 2 కి బోయపాటి శ్రీను(BOyapati Srinu) దర్శకుడు.
14 రీల్స్ పతాకంపై గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన రామ్ ఆచంట, గోపినాద్ ఆచంట తో కలిసి బాలకృష చిన్న కూతురు తేజస్విని అఖండ 2 ని నిర్మిస్తుండగా ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలని మేకర్స్ త్వరలోనే వెల్లడి చేసే అవకాశం ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
