రానా తమ్ముడి 'అహింస' పూర్తయింది!
on Sep 6, 2022

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వస్తున్నాడు. సురేష్ బాబు రెండో కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'అహింస' అనే సినిమాతో డైరెక్టర్ తేజ ఆయనను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న 'అహింస' చిత్రానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. డైరెక్టర్ తేజ సూపర్ హిట్ ఫిల్మ్ 'నువ్వు నేను'ని నిర్మించిన ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. అలాగే అప్పట్లో తేజ సినిమాలకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన ఆర్పీ పట్నాయక్ చాలా కాలం తర్వాత 'అహింస'తోనే తేజ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఇన్ని విశేషాలతో రూపుదిద్దుకుంటున్న అభిరామ్ డెబ్యూ మూవీ 'అహింస'పై దగ్గుబాటి అభిమానుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది.

'చిత్రం'తో ఉదయ్ కిరణ్ ని, 'జయం'తో నితిన్ ని పరిచయం చేసిన తేజ.. వాళ్ళకి మొదటి సినిమాతోనే మెమరబుల్ హిట్ అందించాడు. అలాగే అభిరామ్ ని కూడా సక్సెస్ ఫుల్ ఫిల్మ్ తో లాంచ్ చేస్తాడేమో చూడాలి. ఇప్పటికే విడుదలైన ప్రీలుక్ పోస్టర్ అయితే ఆకట్టుకుంది. ముఖం నిండా గాయాలు, కళ్ళకు గోనె సంచితో టైటిల్ కి పూర్తి భిన్నంగా ఉంది పోస్టర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



