`గ్యాంగ్ లీడర్`కు ఏజెంట్ సాయి ట్విస్టిచ్చాడు!!
on Jun 25, 2019

లేటెస్ట్ గా విడుదలైన `ఏజెండ్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రం పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. ఇటు ప్రేక్షకుల అటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే నేచరల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `గ్యాంగ్ లీడర్`కు ఏజెంట్ సాయి ఎఫెక్ట్ పడ్డదని తెలుస్తోంది. అవును ఏజెండ్ సాయి స్టోరిలైన్ ను పోలి గ్యాంగ్ లీడర్ స్టోరి లైన్ కూడా ఉంటుందట. ముఖ్యంగా కొన్ని ట్విస్టులు సేమ్ టు సేమ్ ఉండటంతో ఇక కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే గ్యాంగ్ లీడర్ షూటింగ్ మొదలై చాలా వరకు జరుపుకుంది. ఇక మార్పులు చేస్తే చేసిందంతా వేస్ట్ అవడమే కాకుండా ప్రకటించిన డేట్ సినిమా అవుతుందా? లేదా? అన్న సందిగ్థంలో పడ్డారట దర్శక నిర్మాతలు. కానీ, దీని పై చిత్ర యూనిట్ ఇంత వరకు ఏమీ స్పందించ లేదు. చూద్దాం దర్శకుడు దీన్ని ఎలా పరిష్కరిస్తాడో అంటున్నారు సినీ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



