హైదరాబాదీ హీరోయిన్ తమిళ పాట!
on Dec 6, 2018

'సమ్మోహనం'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హైదరాబాదీ అదితిరావ్ హైదరి. హిందీ సినిమాల్లో పేరు తెచ్చుకున్న తరవాత తెలుగు సినిమాల్లో అడుగు పెట్టారు. 'సమ్మోహనం'తో పాటు మణిరత్నం 'నవాబ్'లో నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటిగామంచి పేరు తెచ్చుకున్న ఈ సుందరి..త్వరలో గాయనిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా 'జైలు'లో అదితిరావ్ ఓ పాట పాడారు. గాయనిగా ఆమెకు అదే తొలి పాట. 'జైలు'లో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించడంతో పాటు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే అదితిరావ్ పాటను రికార్డ్ చేశారు. తెలుగులో అదితిరావ్ ఎప్పుడు పాడతారో? ఆమెకు ఎవరు అవకాశం ఇస్తారో? తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'అంతరిక్షం'లో అదితిరావ్ హైదరి నటించారు. స్పేస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



