రాశి ఖన్నా ఆ క్లబ్‌లో చేరింది!
on Oct 15, 2020

హీరోయిన్లు అందంగా ఉండడం ఎంత ముఖ్యమో... సన్నజాజి పువ్వులా నాజూకు గా ఉండడం కూడా అంతే ముఖ్యం! సన్నగా ఉండడం కోసమే చాలా కష్టపడుతూ ఉంటారు. ఉదయాన్నే నిద్రలేచి వర్కౌట్లు గట్రా చేస్తూ ఉంటారు. గతంలో కాస్త బొద్దుగా ఉండే రాశి ఖన్నా సైతం కష్టపడి వర్కౌట్లు చేసి సన్నబడ్డారు.

కరుణ కాలంలోనూ రాశి ఖన్నా వర్కవుట్లు చేయడం ఆపలేదు. ప్రతి రోజు జిమ్ కి వెళ్లారు. ఇటీవల తమిళ సినిమా చిత్రీకరణ కోసమే హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లారు. ఉదయాన్నే చిత్రీకరణ మొదలవుతుంది కదా! అందుకని, తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్రలేచి వర్కౌట్లు చేయడం మొదలుపెట్టారు రాశి ఖన్నా. '4ఏఎమ్ క్లబ్' అని పేర్కొన్నారు. కొంతమంది ప్రముఖులు ఉదయాన్నే పనులుంటే వర్కవుట్లు చేయడం మిస్ కాకూడదని తెల్లవారు జామునే నిద్ర లేస్తారు. రాశి ఖన్నా కూడా అలాగే చేస్తున్నారు. 4ఏఎమ్ క్లబ్ లో చేరారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



