బన్నీకి గన్ ఎక్కుపెట్టింది!!
on Jan 23, 2019
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ లవ్ ‘ ప్రచార చిత్రంలో కొంటెగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ వీడియో వైరల్ అయింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె మరోసారి గన్ను ఎక్కు పెట్టి కాల్చేసిన వీడియో వైరల్ అవుతోంది. మలయాళం ఒరు ఆడార్ లవ్ చిత్రాన్ని తెలుగులో `లవర్స్ డే` పేరుతో అనువదిస్తున్నారు ఎ.గురురాజ్. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కొంటెగా కంటి సైగతో బన్ని పై గన్ ఎక్కు పె ట్టి షూట్ చేసింది. ఈ సన్నివేశం ఆ కార్యక్రమానికి విచ్చేసిన వారందిర్నీ అలరించడమే కాకుండా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్స్ వర్క్స్ లో హల్ చల్ చేస్తోంది. ఈ విధంగా ఈ సినిమాకు మంచి ప్రమోషన్ వస్తోంది. ఈ చిత్రాన్ని లవర్స్ డే రోజు ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
