పూనమ్ కౌర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది
on Dec 1, 2022

ప్రముఖ నటి పూనమ్ కౌర్ అనారోగ్యం పాలయ్యారు. ఆమె ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్థారించారు. దీనివల్ల కండరాల నొప్పులు, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుపుతూ జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత ఒక ప్రకటన విడుదల చేశారు.
"గత సంవత్సర కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న పూనమ్ కౌర్ నవంబర్ 10వ తేదీన మాతో కలిసి సూరత్ గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టి పన్ను ఎత్తివేయాలని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 11వ తేదీన సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం.. 12వ తేదీ ఢిల్లీలో జరిగే బ్రహ్మకుమారి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆమెకు వెన్ను నొప్పి రావడంతో కేరళ వెళ్లడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు 18వ తేదీన ఫైబ్రోమయాల్జియా నిర్ధారణ అయ్యింది. కేరళలో ట్రీట్మెంట్ అనంతరం ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె పూర్తి ఆత్మిశ్వాసంతో వున్నారు." అని యర్రమాద వెంకన్న పత్రికా ప్రకటనలో తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



