హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రముఖ నటుడు అరెస్ట్!
on Sep 8, 2024

ప్రముఖ నటుడు, 'జైలర్' ఫేమ్ వినాయకన్ అరెస్ట్ అయ్యాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో గొడవకు దిగడమే కాకుండా, సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ పై వినాయకన్ దాడి చేశాడన్న ఫిర్యాదు అందింది. దీంతో సీఐఎస్ఎఫ్, ఆయనను అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించింది. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. (Actor Vinayakan Arrest)
మలయాళ నటుడైన వినాయకన్ తమిళ సినిమాల్లోనూ నటిస్తుంటాడు. ముఖ్యంగా రజనీకాంత్ 'జైలర్' సినిమాలోని వర్మ పాత్రతో బాగా పాపులర్ అయ్యాడు. అయితే వినాయకన్ కి వివాదాలు కొత్త కాదు. గతంలోనూ మద్యం మత్తులో గొడవలు పడి అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



