బిగ్ బాస్ 4'కి తరుణ్ 'యస్' చెబుతాడా?
on May 22, 2020

తరుణ్ స్టార్ హీరోయే. కానీ, ఇప్పుడు కాదు. ఒకప్పుడు! కొన్నేళ్ళుగా సరైన విజయాలు పడక కొంచెం కెరీర్ గాడి తప్పింది. ఇటువంటి సమయంలో అతడికి 'బిగ్ బాస్' హౌస్ నుండి పిలుపు వచ్చింది. మరి, 'యస్' చెబుతాడా? వందరోజులు 'బిగ్ బాస్' ఇంటిలో ఉండటానికి ఓకే అంటాడా? లేదంటే సున్నితంగా 'నో' చెబుతాడా? చూడాలి. లాక్‌డౌన్‌కి ముందే తెలుగులో 'బిగ్ బాస్' సీజన్ 4 కోసం తరుణ్‌ని సంప్రదించారట. జూన్ నుండి ఈ సీజన్ స్టార్ట్ అవ్వాలి. ప్రజెంట్ సిట్యువేషన్స్ చూస్తుంటే కుదిరేలా కనిపించడం లేదు. జూలైకి పోస్ట్‌పోన్ చేయాలని ఫిక్స్ అయ్యారట. తరుణ్ కాకుండా సింగర్ మంగ్లీ, హాట్ యాంకర్ వర్షిణి తదితరులను సంప్రదించారట.
'బిగ్ బాస్ 4'కి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి ఆయన హోస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో హోస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని స్టార్ మా ఛానల్ జాగ్రత్తలు తీసుకుంటుందని సమాచారం. ఆల్రెడీ హౌస్ సెట్ రెడీగా ఉందట. ఒకసారి ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇస్తే వెంటనే చేయాలని అనుకుంటున్నారట.
Actor Tarun As Contestant In Bogg Boss Season 4 Telugu,hero tarun in Bigg Boss House,Tarun As Contestant In,Bigg Boss 4r Telugu Contestants List Bogg Boss
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



