అక్షర పక్కనే శ్రీహరి అంత్యక్రియలు
on Oct 11, 2013
సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ అని పేరుతెచ్చుకున్న ఏకైక నటుడు శ్రీహరి గత కొన్ని నెలలుగా కాలేయ వ్యాధితో భాధ పడుతున్నాడు. అయితే ఆయన బుధవారం మధ్యాహ్న సమయంలో లీలావతి హాస్పిటల్(ముంబాయి)లో మృతి చెందారు. శ్రీహరి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
శ్రీహరి మృత దేహాన్ని రాజకీయ, సినీ ప్రముఖులతో పాటుగా అభిమానులు, ఆప్తులు శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చి చివరిసారిగా దర్శించుకుని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. శ్రీహరి మృతదేహాన్ని ఆమె కూతురు అక్షర సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు.మన అని అనుకున్న మన షేర్ ఖాన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అనుకుంటేనే భాదగా ఉంది. శ్రీహరి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటుంది ... తెలుగువన్.కామ్