భార్య ఇంట్లోనే హీరోగారి దొంగతనం! అరెస్ట్ చేసిన పోలీసులు!
on Jan 30, 2018

పంచాక్షరి, అహనా పెళ్లంట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం... చిత్రాల్లో నటించిన యువ నటుడు సామ్రాట్ పై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్టేషన్ లో కేసు నమోదైంది. అతని భార్యే హర్షితారెడ్డే... సామ్రాట్ పై కేసు పెట్టడం విశేషం. సామ్రాట్, హర్షితలకు రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. అభిప్రాయ బేధాల కారణంగా ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. అయితే... ఇంట్లో ఎవరూ లేని సమయంలో సామ్రాట్ తన ఇంట్లోకి ప్రవేశించి... ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను ధ్వసం చేసి మరీ.. విలువైన తన ఆభరణాలను దొంగిలించాడని హర్షిత ఆరోపణ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సామ్రాట్ ని అరెస్ట్ చేశారు. ఇదిలావుంటే... ఇప్పటికే... సామ్రాట్ పై గృహహింస, వరకట్నవేధింపుల కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. మరి ఏ కేసు ఎటువంటి మలుపుతీసుకుంటుందో.. పోలీసులకు సామ్రాట్ ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



