షూటింగ్లో యాక్సిడెంట్.. గోపిచంద్‌కు గాయాలు!!
on Feb 18, 2019
`పంతం` సినిమా తర్వాత గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వం లో అనిల్ సుంకర ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం జైపూర్ దగ్గర మాండవ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రోజు తో అక్కడ చిత్రీకరణ ముగించుకుంటొన్న నేపథ్యంలో హీరో గొపిచంద్ పై బైక్ చేజింగ్ పోరాట సన్నవేశాలు చిత్రీకరణ చేస్తోన్న సమయంలో బైక్ స్కిడ్ అవ్వటంతో హీరో గోపీచంద్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించగా అక్కడ డాక్టర్స్ గోపిచంద్ ఆరోగ్యానికైతే ఎలాంటి హాని లేదని, గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం మిగిలిన చిత్రీకరణ జరుపుకోవచ్చని చెప్పడంతో చిత్ర యూనిట్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి ఫోర్టీస్ హాస్పిటల్స్ లో గోపిచంద్ ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అనంతరం కుటుంబ సభ్యులు కొంత టెన్షన్ పడ్డారు. గోపిచంద్ ఫోన్ లో మాట్లాడటంతో కుటుంబ సభ్యులు నెమ్మదించారు. అలాగే `మా` సభ్యులు కూడా సంఘటన గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.