ENGLISH | TELUGU  

ఘనంగా ఆది సాయి కుమార్ నూతన చిత్రం 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' ప్రారంభోత్సవం

on Apr 18, 2024

యంగ్ హీరో ఆది సాయి కుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'చుట్టాలబ్బాయి' తరువాత దర్శకుడు వీరభద్రం చౌదరితో మరోసారి చేతులు కలిపాడు. విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం నాడు కాకతీయ హిల్స్‌లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్‌కు దిల్ రాజు గారు క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. "మా మూవీ ఓపెనింగ్‌కు వచ్చిన దిల్ రాజు గారికి, అనిల్ రావిపూడి గారికి థాంక్స్. చుట్టాలబ్బాయి తరువాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేను, వీరభద్రమ్ గారు ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి కథ, స్క్రిప్ట్ దొరికింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అవుతుంది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. క్రేజీ ఫెలో సినిమాలో నేను, దిగంగనా సూర్యవంశీ కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్నాం. ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే అంటూ అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పాటలు ఇస్తున్నారు. ఈ రోజు అనూప్ గారి పుట్టిన రోజు. మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులతో రాబోతున్నాం. అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాము" అన్నారు.

దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ.. "మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గార్లకు థాంక్స్. చుట్టలబ్బాయ్ తరువాత సినిమా చేయాలని నేను, ఆది చాలా కథలు విన్నాం. ఇప్పటికి మాకు టైం, లక్ కలిసి వచ్చింది. మంచి కథ దొరికింది. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఆది సరసన దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మా సినిమాను నిర్మాతలు తూము నరసింహా, జామి శ్రీనివాసరావు  ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, రామ్ డైలాగ్స్, శ్యాం విజువల్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మాకు అండగా నిలిచిన మీడియాకు థాంక్స్" అని అన్నారు.

సాయి కుమార్ మాట్లాడుతూ.. "దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు ఎంత బిజీగా ఉన్నా అడిగిన వెంటనే వచ్చినందుకు థాంక్స్. వీరభద్రమ్ గారికి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. మేం చేసిన చుట్టలబ్బాయ్ బాగా ఆడింది. ఆయన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీస్తుంటారు. కృష్ణ ఫ్రమ్ బృందావనం కూడా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఆదికి అనూప్ రూబెన్స్ ఎప్పుడూ కూడా బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూనే వచ్చారు. ఈ సినిమాలోనూ మంచి పాటలు ఉండబోతున్నాయి. ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు మంచి కథతో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ.. "ఆది గారితో ఇది వరకు నేను క్రేజీ ఫెలో సినిమా చేశాను. మళ్లీ ఆది గారితో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. వీరభద్రమ్ గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్" అని అన్నారు.

ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, మాస్టర్ రిత్విక్, వెంకట్ నారాయణ, గురు రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా శ్యామ్, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.