ముత్తయ్య బయోపిక్.. రంగంలోకి లక్ష్మణ్
on Sep 22, 2023
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా శ్రీలంకకు చెందిన స్టార్ క్రికెటర్.. టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌పై ‘800’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి శ్రీపతి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. అక్టోబర్ 6న ‘800’ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతుంది.
‘800’ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ వర్క్‌లో వేగం పుంజుకుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 25న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంటైర్ యూనిట్‌తో పాటు ప్రముఖ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని సమాచారం. ఆయనతో పాటు ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, సుకుమార్‌లను కూడా చీఫ్ గెస్టులుగా ఆహ్వానించే పనిలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. '800' ఆలిండియా పంపిణీ హక్కులను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
నిజానికి ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాల్సింది. ప్రకటన కూడా వచ్చింది. అయితే తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా మక్కల్ సెల్వన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మురళీధరన్ బౌలింగ్ యాక్షన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దీనిపై ఆయన ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. అయితే వాటన్నింటినీ అధిగమించి స్టార్ బౌలర్‌గా ఎవరూ ఊహించని రేంజ్‌కు చేరుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి మరి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
