8 వసంతాలు మూవీ రివ్యూ
on Jun 19, 2025
తారాగణం: అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి, రవి దుగ్గిరాల, కన్నా పసునూరి, సంజనా హార్ద గేరి తదితరులు
సంగీతం: హేషం అబ్దుల్ వాహబ్
డీఓపీ: విశ్వనాధ్ రెడ్డి
ఎడిటర్: శశాంక్ మాలి
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
బ్యానర్ :మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ: జూన్ 20, 2025
అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers) బ్యానర్ లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ '8 వసంతాలు'(8 Vasantalu). మ్యాడ్ మూవీ ఫేమ్ 'అనంతిక సనిల్ కుమార్'(Anathika Sanilkumar) టైటిల్ రోల్ పోషించగా, 'ఫణీంద్ర నర్సెట్టి'(Phanindra Narsetty) దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రచార చిత్రాలతో మూవీ లవర్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
శుద్ధి అయోధ్య (అనంతిక) ఆత్మాభిమానం మెండుగా ఉన్న అమ్మాయితో పాటు, అందం అనేది మనసుకి సంబంధించిదనేది తన నమ్మకం. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న 'శుద్ధి' ఊటీలో తల్లితో పాటు కలిసి ఉంటుంది. మనుషుల్లో చైతన్యం నింపడానికి రచనలు కూడా చేస్తుంటుంది. ఆమె రాసిన కొన్ని పుస్తకాలు బాగా ఫేమస్. వరుణ్(హను రెడ్డి) ఒక పెద్దింటి అబ్బాయి. మ్యూజిక్ లో ఉన్నత శిఖరాలు అందుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. శుద్ధి వ్యక్తిత్వం, రచనలు చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య కొంత కాలం ట్రావెలింగ్ జరిగిన తర్వాత శుద్ధికి వరుణ్ ప్రపోజ్ చేస్తాడు.తండ్రి మరణం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తన జీవితంలోకి వచ్చిన మొదటి ప్రేమని శుద్ధి ఆహ్వానిస్తుంది. వరుణ్ మాత్రం శుద్ధిని వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకి శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. సంజయ్ ఒక ఫేమస్ రైటర్. సంజయ్ ని తొలి చూపులోనే శుద్ధి ప్రేమిస్తుంది. ఈ లోపు శుద్ధి వాళ్ళ అమ్మ వేరే పెళ్లి సంబంధం చూస్తే శుద్ధి అందుకు ఒప్పుకుంటుంది. కానీ శుద్ధి కి తెలియని విషయం ఏంటంటే శుద్ధి ' 8 వసంతాల' లో సంజయ్ పాత్ర ఉంటుంది. శుద్ధి' 8 వసంతాల'లో సంజయ్ పాత్ర ఏ విధంగా ఉంది? వరుణ్ శుద్ధి కి ఎందుకు బ్రేక్ అప్ చెప్పాడు? శుద్ధి రచనలు చెయ్యడానికి ఏమైనా కారణం ఉందా? మార్షల్ ఆర్ట్స్ లో శుద్ధి కి ఉన్న గోల్ ఏంటి? తల్లి చెప్పిన పెళ్ళి శుద్ధి ఎందుకు ఒప్పుకుంది? శుద్ధి ప్రేమ రెండో సారి కూడా ఓడిపోయిందా లేక గెలిచిందా అనేదే '8 వసంతాలు' చిత్ర కథ
ఎనాలసిస్
సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిన కొన్ని ప్రేమ కథలు, థియేటర్ నుంచి బయటికి వచ్చినా, మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ప్రేమ కథే ఈ '8 వసంతాలు'. టైటిల్ కి తగ్గట్టే సినిమా చూస్తున్నంతసేపు ఒక కొత్త వసంతం మన కళ్ళ ముందు కదలాడుతుందా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే శుద్ధి, వరుణ్ ఇంట్రడక్షన్ తో పాటు ఆ ఇద్దరి లక్ష్యానికి సంబంధించిన సీన్స్ బాగున్నాయి. పైగా ఊటీలో చిత్రీకరించడం వల్ల ఫ్రెష్ నెస్ వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళిద్ద రీ మధ్య వచ్చిన లవ్ సీన్స్ కొత్తగా ఉన్నా, అంతగా కనెక్ట్ అవ్వలేం. లవ్ గా కంటే ఆ ఇద్దరు ఎట్రాక్షన్ అయినట్టుగా ఆయా సన్నివేశాలు ఉన్నాయి. బ్రేక్ అప్ సీన్ మాత్రం హైలెట్. ఆ సమయంలో వచ్చిన డైలాగ్స్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించేవిగా ఉన్నాయి. శుద్ధి ఆమె చిన్ననాటి ఫ్రెండ్ కార్తీక్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో పరిణితి చెందిన శుద్ధి కనిపించింది. కాశీలో చేసిన ఫైట్ ఐతే చాలా బాగా వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చే గురువు, శుద్ధి కి మధ్య వచ్చిన సన్నివేశాలు కథకి మంచి బలాన్ని ఇవ్వడంతో పాటు గురు, శిష్యుల గొప్పతనాన్ని చెప్పింది. రైటర్ అయిన సంజయ్ ని శుద్ధి నే ఇష్టపడుతుంది. దీంతో కథనంలో వేగం పెరగడంతో పాటు, ఈ సారి శుద్ధి లవ్ ఏమవుతుందనే క్యూరియాసిటి వచ్చింది. స్వతహాగా మంచి మనసు గల వాడైన సంజయ్ కూడా శుద్ధిని ఇష్టపడతాడు. అలా కాకుండా సంజయ్ ని నెగిటివ్ షేడ్ లో చూపించాల్సింది. ఎట్ లీస్ట్ సంజయ్ నెగిటివ్ క్యారక్టర్ అని చీటింగ్ అయినా చేసుండాల్సింది. అప్పుడు శుద్ధి క్యారెక్టర్ పై సానుభూతి కలిగి, ఈ సారి తన ప్రేమ ఏమవుతుందనే క్యూరియాసిటి ఉండేది. క్లైమాక్స్ కొత్తగానే ఉన్నా, వరుణ్ క్యారెక్టర్ ఎలివేషన్ అవ్వడంతో, ఈ కథకి మూలమైన శుద్ధి 8 వసంతాల ప్రయాణాన్ని బీట్ చేసినట్లయింది. వరుణ్ క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్ లో చూపించాల్సింది. మూవీ మొత్తం మీద వచ్చే మార్షల్ ఆర్ట్స్ నేపధ్యం కావాలని మిక్స్ చేసినట్టుగా అనిపిస్తుంటుంది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
శుద్ధి అయోధ్య క్యారెక్టర్ లో అనంతిక పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అభిమానాన్ని పంచే స్నేహితురాలిగా, ప్రేమ కోసం పరితపించే ప్రేమికురాలుగా, ఆ ప్రేమ తనకి దక్కనప్పుడు, బాధని దిగమింగుకుంటూ, మనో ధైర్యాన్ని తెచ్చుకునే సగటు అమ్మాయిలా, తల్లి చాటు బిడ్డలా, మార్షల్ ఆర్ట్స్ ద్వారా చెడుని ఎదుర్కునే డేరింగ్ ఉన్న అమ్మాయిలా, ఒక రచయిత్రిగా ఇలా అన్ని వేరియేషన్స్ లోను చాలా అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించింది. తెలుగు సినిమాకి ఇంకో మంచి నటి అనంతిక ద్వారా లభించినట్టే. హను రెడ్డి, రవి దుగ్గిరాల, కన్నా పసునూరి, సంజనా హార్ద గేరి కూడా ఎంతో అనుభవమున్న వాళ్ళల్లా నటించి తమ క్యారెక్టర్స్ కి నిండుతనాన్ని తీసుకొచ్చారు. ఫణింద్ర( దర్సకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోను కనపడింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. రచయితగా మాత్రం సెకండ్ హాఫ్ లో తడబడ్డాడు. డైలాగ్స్ ఇన్ స్పైర్ గా ఉండటంతో పాటు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. మైత్రి నిర్మాణ విలువల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వాళ్ళు లేనిదే ఈ సినిమా లేదనేంతలా ప్రొడక్షన్స్ వాల్యూస్ ఉన్నాయి. ఈ విషయం ప్రతి ఫ్రేమ్ లోను స్పష్టంగా కనపడింది. విశ్వనాధ్ రెడ్డి ఫొటోగ్రఫీ కూడా హైలెట్ గా నిలిచింది. విజువల్స్ పరంగా ఆయన మ్యాజిక్ ఎక్స్ లెంట్. హేషం అబ్దుల్ సాంగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి సంజీవిని గా నిలిచాయి.
ఫైనల్ గా చెప్పాలంటే నువ్వు వెతికే అమృతత్వాన్ని పంచే ప్రేమ '8 వసంతాలు' నుంచి నీ చుట్టూనే తిరుగుతుంటుంది. కాకపోతే నువ్వు గుర్తించలేదని చెప్పిన '8 వసంతాలు' పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచం మైనస్. అనంతిక నటన ప్లస్ పాయింట్.
రేటింగ్ 2.5/5 అరుణాచలం

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
