లావణ్యా త్రిపాఠి గురించి మీకు తెలీని 7 విషయాలు
on Aug 19, 2020

లావణ్యా త్రిపాఠి వాళ్లది చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. వాళ్ల నాన్న లాయర్. అమ్మ కొన్నేళ్లు టీచర్‌గా పనిచేశారు. అక్క ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్. థియేటర్ ఆర్టిస్ట్ అయిన అన్నయ్య 'లా' చేశాడు. లావణ్య ముంబైలో మోడలింగ్ చేసేటప్పుడు 'అందాల రాక్షసి'గా నటించే ఛాన్స్ వచ్చి టాలీవుడ్‌లో అడుగు పెట్టింది.
సక్సెస్‌కు పొంగిపోవడం, ఫెయిల్యూర్‌కు కుంగిపోవడం ఆమెకు తెలీదు. అన్ని పరిస్థితుల్లోనూ న్యూట్రల్‌గా ఉండగలదు. ఆ స్వభావమే ఆమెకు సినిమా ఇండస్ట్రీలో ఉపయోగపడింది.
లావణ్య అసలు గాసిప్ప్ పట్టించుకోదు. తనేం తినాలనుకుంటే అది తింటుంది. తనకు నచ్చినట్లు ఉంటుంది.
ఆమెకు హైదరాబాద్ వాతావరణమంటే బాగా ఇష్టం. ముఖ్యంగా ఫుడ్. ఆమె బేసిగ్గా వెజిటేరియన్ అయినా హైదరాబాద్ బిర్యానీ ఇంటే ప్రాణం. చికెన్ బిర్యానీ మరీ ఇష్టం. నాన్‌వెజ్ తినదు కాబట్టి చికెన్ ముక్కలు పక్కన పెట్టేసి మసాలా బిర్యానీ లాగించేస్తుంది.
సినిమాల్లో చూసే లావణ్యకు, ఇంట్లో లావణ్యకు చాలా తేడా ఉంది. ఇంట్లో ఆమె చాలా అల్లరి అమ్మాయి. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లకు ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తుంటుంది. అమ్మ దగ్గర వంట బాగా నేర్చుకుంది. ఇండియన్, చైనీస్ ఐటమ్స్ చెయ్యడంలో ఎక్స్‌పర్ట్. దాల్ రైస్, పచ్చడి. ఇడ్లీ, సాంబార్ బాగా చేస్తుంది.
ఫ్రీటైమ్‌లో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్స్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తుంటుంది లావణ్య. తన వరకు వచ్చేసరికి ఎమోషనల్, కామెడీ సీన్స్ బాగా పండిస్తుంది. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు అనుష్క లాగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలనేది ఆమె యాంబిషన్.
నిజాయితీ, సిన్సియారిటీ, ఇంటలిజెన్స్, లాయల్టీ అనేవి తనలో ఉన్న గుణాలని ఆమె నమ్ముతుంది. తన జీవిత భాగస్వామి కాబోయేవాడికి కూడా ఇలాంటి గుణాలు ఉండాలని ఆమె కోరుకుంటోంది. లవ్ మ్యారేజ్ మీద ఆమెకు ఆసక్తి లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనేది ఆమె ఆలోచన. ఇప్పట్లో అయితే పెళ్లి ఆలోచనలు లేవు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



