Home

»

Latest News

ఎన్టీఆర్ `వేట‌గాడు`కి 43 ఏళ్ళు!

Jul 5, 2022 1:15PM

న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క రామారావు - అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి - ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావుది.. బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్. ఈ ముగ్గురి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సంచ‌ల‌న చిత్రాల్లో `వేట‌గాడు` ఒక‌టి. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా.. `అడ‌వి రాముడు`(1977) లాంటి ఇండ‌స్ట్రీ హిట్ థియేట్రిక‌ల్ ర‌న్ రికార్డ్ ని అధిగ‌మించ‌డ‌మే కాకుండా, అత్యంత వేగంగా రూ. కోటి గ్రాస్ ఆర్జించిన తెలుగు చిత్రంగా అప్ప‌ట్లో స‌రికొత్త రికార్డుని న‌మోదు చేసింది. జంధ్యాల ర‌చ‌న చేసిన ఈ చిత్రంలో రావుగోపాల‌రావు, స‌త్య‌నారాయ‌ణ‌, జ‌గ్గ‌య్య‌, కాంతారావు, పుష్ప‌ల‌త‌, అల్లు రామ‌లింగ‌య్య‌, చ‌ల‌ప‌తిరావు, న‌గేశ్, పండ‌రీబాయి  ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌గా.. జ‌య‌మాలిని ఓ ప్ర‌త్యేక గీతంలో త‌న చిందుల‌తో క‌నువిందు చేసింది.

చ‌క్ర‌వ‌ర్తి స్వ‌రాలు స‌మ‌కూర్చిన `వేట‌గాడు`కి వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి సాహిత్య‌మందించారు.  ఇందులోని ``ఆకు చాటు పిందె త‌డిసె`` చార్ట్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌గా..  ``బంగారు బాతు గుడ్డు``, ``జాబిలితో చెప్ప‌నా``, ``ఓసోసి పిల్ల‌కోడి పెట్ట‌``, ``కొండ‌మీద చంద‌మామ‌``, ``పుట్టింటోళ్ళు త‌రిమేశారు`` గీతాలు కూడా రంజింప‌జేశాయి. రోజా మూవీస్ ప‌తాకంపై ఎం. అర్జున‌రాజు, కె. శివ‌రామ‌రాజు నిర్మించిన `వేట‌గాడు`.. హిందీలో `నిషానా` (జితేంద్ర‌, పూనమ్ థిల్లాన్) పేరుతో రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలోనే రీమేకై అక్క‌డా మంచి విజ‌యం సాధించింది. 1979 జూలై 5న విడుద‌లై సంచ‌ల‌న‌ విజ‌యం సాధించిన `వేట‌గాడు`.. నేటితో 43 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com