Home

»

Latest News

చ‌ర‌ణ్ సినిమాలో సూర్య‌!?

Jul 5, 2022 12:55PM

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినిమాలో కోలీవుడ్ టాప్ స్టార్ సూర్య సంద‌డి చేయ‌నున్నారా? అవున‌న్న‌దే ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. సెన్సేష‌నల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా ఓ భారీ బ‌డ్జెట్ మూవీ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ లో రామ్ చ‌ర‌ణ్ కి జంట‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని న‌టిస్తుండ‌గా.. అంజ‌లి, శ్రీ‌కాంత్, జ‌య‌రామ్, సునీల్ ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఎస్.జె. సూర్య విల‌న్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు సూర్య కూడా న‌టించ‌బోతున్నార‌ట‌. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ లో కాసేపు అతిథిగా సూర్య ఎంట‌ర్టైన్ చేయ‌నున్నార‌ట‌. `విక్ర‌మ్` సినిమాలో మాదిరిగా ఇందులో పోషిస్తున్న గెస్ట్ రోల్ కూడా సూర్య కెరీర్ లో గుర్తుండిపోయేలా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ బాణీలు అందిస్తున్న `#RC 15`.. వ‌చ్చే ఏడాది వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com