Home

»

Latest News

కృష్ణ `వ‌జ్రాయుధం`కి 37 ఏళ్ళు!

Jul 5, 2022 1:24PM

1980ల్లో తెలుగువారిని విశేషంగా అల‌రించిన జంట‌ల్లో.. సూప‌ర్ స్టార్ కృష్ణ‌, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి జోడీ ఒక‌టి.  ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ప్ర‌జారంజ‌క చిత్రాల్లో `వ‌జ్రాయుధం`కి ప్ర‌త్యేక స్థానం ఉంది.  ప‌గ‌, ప్ర‌తీకారం అంశాల మేళ‌వింపుగా రూపొందిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌, సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి కె.ఎస్. ప్ర‌కాశ్ ఛాయాగ్ర‌హ‌ణం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇందులో రావుగోపాల‌రావు, స‌త్యనారాయ‌ణ‌, నూత‌న్ ప్ర‌సాద్, అల్లు రామ‌లింగ‌య్య‌, రాజా, ప్ర‌భాక‌ర‌రెడ్డి, చ‌ల‌ప‌తిరావు, కాంతారావు, అశ్వ‌ని, శుభ‌, శ్యామ‌ల‌గౌరి, బేబి సీత ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించారు.

చ‌క్రవ‌ర్తి సంగీత‌మందించిన `వజ్రాయుధం`కి వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి సాహిత్య‌మందించారు.  ఇందులోని ``ఆ బుగ్గ‌మీద ఎర్ర‌మొగ్గ‌లేంద‌బ్బా``, ``స‌న్న‌జాజి ప‌క్క మీద‌`` పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్స్ గా నిల‌వ‌గా.. ``అద్దంకి చీర‌లో``, ``కృష్ణ‌మ్మ పెన్న‌మ్మ‌`` గీతాలు కూడా రంజింప‌జేశాయి.  ల‌క్ష్మీ ఫిలింస్ డివిజ‌న్ ప‌తాకంపై కె. లింగ‌మూర్తి నిర్మించిన `వ‌జ్రాయుధం`.. 1985 జూలై 5న విడుద‌లై జ‌న‌నీరాజ‌నాలు అందుకుంది. కాగా, నేటితో ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 37 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com