ఓటీటీలోకి '35 చిన్న కథ కాదు' మూవీ
on Sep 29, 2024

నివేదా థామస్ (Nivetha Thomas) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం '35 చిన్న కథ కాదు' (35 Chinna Katha Kaadu). నందకిషోర్ ఈమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇందులో పదేళ్ల కొడుకుని మ్యాథ్స్ ఎగ్జామ్ లో పాస్ చేయడం కోసం తల్లి పడే తపన హత్తుకుంది. థియేటర్లలో మ్యాజిక్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. (35 Movie)
'35 చిన్న కథ కాదు' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆహా ప్రకటించింది. "ఈ చిన్న కథలో వెనుక పెద్ద పాఠం ఉంది. మన ఇంటి కథలా అనిపిస్తుంది." అంటూ అనౌన్స్ మెంట్ పోస్టర్ వదిలింది.
రానా దగ్గుబాటి సమర్పణలో సృజన ఎర్రబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన '35 చిన్న కథ కాదు'లో నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ, అరుణ్ దేవ్, ప్రియదర్శి, భాగ్యరాజ్, గౌతమి తదితరులు నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మి, ఎడిటర్ గా టి.సి. ప్రసన్న వ్యవహరించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



