`బొబ్బిలి సింహం`గా బాలయ్య గర్జించి నేటికి 27 ఏళ్ళు!
on Sep 23, 2021

`సింహం`తో ముడిపడిన టైటిల్స్.. నటసింహం నందమూరి బాలకృష్ణకి భలేగా అచ్చొచ్చాయి. వాటిలో బ్లాక్ బస్టర్స్ తో పాటు ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అలా.. ఘనవిజయం సాధించిన సినిమాల్లో `బొబ్బిలి సింహం` ఒకటి. బాలయ్య కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఎ. కోదండరామి రెడ్డి ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాకి దర్శకత్వం వహించగా.. ప్రముఖ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఇందులో బాలయ్యకి జంటగా రోజా, మీనా నటించగా శారద, సత్యనారాయణ, జగ్గయ్య, శరత్ బాబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మోహన్ రాజ్, మహేశ్ ఆనంద్, జేవీ సోమయాజులు, శివాజీరాజా, చలపతి రావు, సంగీత, సుధ, మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
స్వరవాణి కీరవాణి బాణీలు కట్టిన ఈ చిత్రానికి.. వేటూరి, జాలాది సాహిత్యమందించారు. ``శ్రీరస్తు శుభమస్తు``, ``పాలకొల్లు పాప``, ``మాయదారి పిల్లడా``, ``కిట్టమ్మ లీల``, ``ఈడు ఈల వేసినా``, ``లకడీ కా పూలట``.. ఇలా ఇందులోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించిన `బొబ్బిలి సింహం`.. 1994 సెప్టెంబర్ 23న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 27 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



