`హిట్లర్`గా మెగాస్టార్ మెస్మరైజ్ చేసి నేటికి పాతికేళ్ళు!
on Jan 4, 2022

``అంతొద్దు.. ఇది చాలు..`` అంటూ మెగాస్టార్ చిరంజీవి సందడి చేసిన చిత్రం `హిట్లర్`. వరుస పరాజయాల్లో ఉన్న చిరుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన ఈ సినిమా.. 1996 నాటి మాలీవుడ్ హయ్యస్ట్ గ్రాసర్ `హిట్లర్` (మమ్ముట్టి టైటిల్ రోల్) ఆధారంగా రూపొందింది. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఏడుగురు చెల్లెళ్ళకి అన్నగా అలరించారు చిరు. చెల్లెళ్ళ పాత్రల్లో అశ్వని, మోహిని, గాయత్రి, పద్మశ్రీ, మీనా కుమారి, బేబి శ్రేష్ఠ కనిపించగా.. మెగాస్టార్ కి జోడీగా రంభ దర్శనమిచ్చింది. రాజేంద్రప్రసాద్, దాసరి నారాయణరావు, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, పొన్నంబలం, బాబూ మోహన్, సుధాకర్, ఉత్తేజ్, కల్పనా రాయ్, అచ్యుత్, అనంత్, శుభ, వై. విజయ, నారాయణరావు, మాస్టర్ బాలాదిత్య ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. సెంటిమెంట్ చిత్రాల స్పెషలిస్ట్ ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎడిటర్ మోహన్ సమర్పణలో ఎం.వి. లక్ష్మి నిర్మించారు. ఎల్బీ శ్రీరామ్ సంభాషణలు `హిట్లర్`కి అదనపు బలంగా నిలిచాయి.
Also Read:'విక్రమార్కుడు' హిందీ వెర్షన్‌కు సీక్వెల్ రాబోతోంది!
ఇక కోటి సంగీత సారథ్యంలో రూపొందిన గీతాలన్నీ ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``నడక కలిసిన నవరాత్రి`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``మిస మిస మెరుపుల``, ``కన్నీళ్ళకే కన్నీళ్ళు``, ``ఓ కాలమా..``, `` కూసింది కన్నె కోయిల`, ``ప్రేమా జోహార్` గీతాలు కూడా రంజింపజేశాయి. 1997 జనవరి 4న సంక్రాంతి కానుకగా విడుదలైన `హిట్లర్`.. పలు కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ పాతికేళ్లు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



