Home

»

Latest News

`బీస్ట్` రిలీజ్ డేట్.. ఆమిర్, య‌శ్ తో విజ‌య్ క్లాష్!?

Jan 17, 2022 3:42PM

`మాస్ట‌ర్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత కోలీవుడ్ స్టార్ విజ‌య్ నుంచి రాబోతున్న సినిమా `బీస్ట్`. `డాక్ట‌ర్` ఫేమ్ నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే క‌థానాయిక‌. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఏప్రిల్ లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు కొన్నాళ్ళు క్రితం ప్ర‌క‌టించారు. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. త‌మిళ సంవ‌త్స‌రాది కానుక‌గా ఏప్రిల్ 14న `బీస్ట్` థియేట‌ర్స్ లోకి రాబోతోంద‌ట‌. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఈ సినిమా సంద‌డి చేయ‌నుంది.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. స‌రిగ్గా ఇదే ఏప్రిల్ 14కి `కేజీఎఫ్` సెకండ్ పార్ట్ `కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 2` కూడా పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతోంది. అంతేకాదు.. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ కొత్త చిత్రం `లాల్ సింగ్ చద్ధా` కూడా అదే రోజున హిందీతో పాటు ప్రాంతీయ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. మొత్త‌మ్మీద‌..

ఏప్రిల్ 14న‌ ఆమిర్ ఖాన్ వర్సెస్ విజ‌య్ వ‌ర్సెస్ య‌శ్ అన్న‌ట్లుగా ఉండ‌బోతోంద‌న్న‌మాట‌. మ‌రి.. ఈ బాక్సాఫీస్ క్లాష్ లో ఎవ‌రెవ‌రు స‌క్సెస్ అందుకుంటారో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com