Home

»

Latest News

ఉగాదికి ప‌ట్టాలెక్క‌నున్న తార‌క్ కొత్త చిత్రం!

Jan 17, 2022 3:15PM

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ వెండితెర‌పై సంద‌డి చేసి మూడేళ్ళు దాటింది. 2018 ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`తో చివ‌రి సారిగా సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎంట‌ర్టైన్ చేశారు తార‌క్. ఆయ‌న కొత్త చిత్రం `ఆర్ ఆర్ ఆర్` అనివార్య కార‌ణాల వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతోంది. అన్నీ అనుకూలంగా ఉంటే.. ఈ సంక్రాంతికి `ఆర్ ఆర్ ఆర్` థియేట‌ర్స్ లో సంద‌డి చేసి ఉండేది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మ‌రోమారు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా ప‌డింది. బ‌హుశా.. ఈ ఏడాది వేస‌విలో `ఆర్ ఆర్ ఆర్` విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముండొచ్చు.

ఇదిలా ఉంటే.. `ఆర్ ఆర్ ఆర్` త‌రువాత ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని విజ‌న‌రీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో చేయ‌బోతున్నారు. `జ‌నతా గ్యారేజ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత వీరి క‌ల‌యిక‌లో రాబోతున్న ఈ సినిమా ఉగాది సంద‌ర్భంగా సెట్స్ పైకి వెళుతుంద‌ని అంటున్నారు. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి సంవ‌త్స‌రాంతంలో లేదా 2023 సంక్రాంతి కానుక‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విడుద‌ల చేసే అవ‌కాశ‌ముందంటున్నారు. అంతేకాదు.. రివెంజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ పాన్ - ఇండియా వెంచ‌ర్ లో తార‌క్ కి జోడీగా ర‌ష్మిక న‌టించే అవ‌కాశ‌ముందంటున్నారు. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ - కొర‌టాల సెకండ్ జాయింట్ వెంచ‌ర్ కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com