2021 జ్ఞాపకాలుః అలరించిన స్పోర్ట్స్ డ్రామాస్!
on Dec 31, 2021

2021 క్యాలెండర్ ఇయర్ లో కొన్ని స్పోర్ట్స్ డ్రామాలు సందడి చేశాయి. విభిన్న కథాంశాలతో ఈ చిత్రాలు తెరకెక్కడం విశేషం. ఆ సినిమాల వివరాల్లోకి వెళితే..
సీటీమార్ః- మహిళల కబడ్డీ నేపథ్యంలో `సీటీమార్` చిత్రం తెరకెక్కింది. సంపత్ నంది రూపొందించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో ఆంధ్ర మహిళల కబడ్డీ కోచ్ గా గోపీచంద్ కనిపిస్తే.. తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ గా తమన్నా దర్శనమిచ్చింది. ఎన్నో ఉత్కంఠభరిత ఘటనల అనంతరం కబడ్డీ నేషనల్ ఛాంపియన్ షిప్ లో కథానాయకుడి టీమ్ ఎలా గెలిచిందన్నదే ఈ సినిమా కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముంగిట విజేతగా నిలిచింది.
A1 ఎక్స్ ప్రెస్ః- తమిళ చిత్రం `నట్పే తుణై` ఆధారంగా రూపొందిన సినిమా `A1 ఎక్స్ ప్రెస్`. హాకీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఇద్దరు కూడా హాకీ ప్లేయర్స్ గా కనిపించడం విశేషం. డెన్నిస్ జీవన్ కనుకొలను రూపొందించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలను చర్చించారు. బాక్సాఫీస్ ముంగిట ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
లక్ష్యః- ఈ ఏడాది చివరలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో నాగశౌర్య, జగపతి బాబు, కేతికా శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. ఆర్చరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విలుకాడి పాత్రలో దర్శనమిచ్చాడు నాగశౌర్య. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం శౌర్య నెవర్ సీన్ బిఫోర్ లుక్ లో కనిపించాడు. తాతయ్య కలను నెరవేర్చి పతకం గెలిచిన ఓ మనవడి కథే `లక్ష్య` సినిమా. బాక్సాఫీస్ ముంగిట `లక్ష్య` ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



