తెలుగులో హిట్ గా నిలిచిన '2018'
on May 29, 2023
2018లో సంభవించిన కేరళ వరదల సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన మలయాళ చిత్రం '2018'. టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకుడు. మలయాళ వెర్షన్ మే 5 న విడుదల కాగా, రూ.150 కోట్ల గ్రాస్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక తెలుగు వెర్షన్ మే 26 న విడుదల కాగా, ఇక్కడ కూడా విజయం సాధించడం విశేషం.
'2018' చిత్రాన్ని తెలుగునాట బన్నీ వాసు విడుదల చేశారు. తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వేల్యూ రూ.1.80 కోట్లని అంచనా. అయితే మొదటి వీకెండ్ లోనే రెండు కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా, తెలుగులోనూ హిట్ స్టేటస్ దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.02 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.1.71 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.1.60 కోట్ల గ్రాస్ రాబట్టిన '2018'.. మూడు రోజుల్లో రూ.4.33 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. షేర్ పరంగా చూస్తే రూ.2.02 కోట్లు రాబట్టింది.
సినిమాకి పాజిటివ్ టాక్ కి తోడు, వేసవి సెలవులు కావడం.. పైగా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడంతో ఫుల్ రన్ లో '2018' సినిమా తెలుగులో మంచి లాభాలనే పొందే అవకాశముంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
