2.o కోసం వెయిట్ చేస్తున్నా
on Nov 27, 2018

సూపర్ స్టార్ రజనీకాంత్ , బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శత్వంలో వస్తోన్న చిత్రం `2.0` ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ చిత్ర టీమ్ సోమవారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రజనీ కాంత్ మాట్లాడుతూ... ``ఈ సినిమాకు అసలు ప్రమోషన్ అక్కర్లేదు. ఎన్ వి ప్రసాద్ గారు ఊరికే డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా పై బోలెడు అంచనాలున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత చూసిన వాళ్లే ఈ సినిమాను ప్రమోట్ చేస్తారు.
1975లో నేను నటించిన తొలి చిత్రం అపూర్వ రాగంగల్ సినిమాను చూడాలని ఎంత ఉబలాటపడ్డానో ...43 ఏళ్ల తర్వత 2.0 సినిమా కోసం అంతే క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ట్రైలర్ లో చూసింది కేవలం పది శాతమే. సినిమాలో అంతా ఆశ్చర్యపోయే గ్రాఫిక్స్ , ఎమోషనల్ సన్నివేశాలుంటాయి. మన సినిమా ఇండస్ట్రీకే 2.0 గర్వపడే సినిమా అవుతుంది`` అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



