ఎట్టకేలకు కథ క్లైమాక్స్ కి వచ్చింది!!
on Dec 22, 2018
ప్రజంట్ ఒక్క హిట్ పడ్డదంటే చాలు ఆ హీరో తన తదుపరి సినిమా విషయంలో కాళ్ళు , వేళ్లు పెట్టేస్తున్నారు. ఎప్పుడో ప్రారంభమైనా కానీ, 2 స్టేట్స్ చిత్రం ఇంకా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందంటే ...సినిమా షూటింగ్ ఎంత డిలే అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ డిలే కి కారణం హీరో స్క్రిప్టులో ఎక్కువగా ఇన్ వాల్వ్ కావడమేనట. క్షణం, గూఢరాచి చిత్రాలు సక్సెస్ కావడంతో అడవి శేషు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడట. దీని వల్ల దర్శకుడికి, నిర్మాతకు, హీరోకు ఎవరకీ సరిగా పొసగడం లేదంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆ సమస్యలన్నీ తొలిగిపోయి మరల షూటింగ్ ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది.
లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్`. చేతన్ భగత్ రాసిన నవల `2 స్టేట్స్` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడవిశేష్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మాత. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ను జనవరిలో అమెరికాలో జరుపుకోనుంది.
ఇప్పటికే కోల్‌కతాలో రెండు షెడ్యూల్స్, హైదరాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఇప్పటి వరకు సినిమా 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ షూటింగ్ అమెరికాలో జరగనుంది. జనవరి 2019 లో యూనిట్ అమెరికా బయలుదేరుతుంది. అక్కడ మిగిలిన 40 శాతం చిత్రీకరణను పూర్తి చేస్తారు. అమెరికా షూటింగ్‌తో 90 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. బ్యాలెన్స్ 10 శాతం ప్యాచ్ వర్క్‌ను హైదరాబాద్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ చిత్రం ద్వారా వెంకట్ రెడ్డి దర్శకుడుగా పరిచయమవుతున్నారు.