బ్లూ రే డివిడి లో "100%లవ్" సినిమా
on Jun 20, 2011
బ్లూ రే డివిడి లో "100%లవ్" సినిమా రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం తెలిసింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన చిత్రం "100%లవ్".
(3).jpg)
ఈ 100%లవ్" సినిమాని ప్రసాద్ ఇయఫ్ఎక్స్ వారు బ్లూ రే డివిడి రూపంలో తీసుకు రాబోతున్నారు. ప్రసాద్ ఇయఫ్ఎక్స్ వారు తీసుకురాబోతున్న ఈ బ్లూ రే డివిడిలో హెచ్ డి 24 ఎఫ్ పి యస్ వీడియో, హెచ్ డి మాస్టర్ ఆడియో,డాల్బీ డిజిటల్ 5.1 సరౌండ్ సౌండ్ , ఇంప్రూవ్డ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, సాంగ్స్ మెను, పాప్ అప్ మెను ఆప్షన్ లు ఉంటాయి. "100%లవ్" సినిమా వందరోజులు పూర్తిచేసుకోగానే ఈ బ్లూ రే డివిడిలను మార్కెట్లోకి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు గీతా ఆర్ట్స్ వారు. ఈ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతూంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



