వారం రోజుల కోసం.. రంగంలోకి దిగిన 10 సినిమాలు!
on Dec 14, 2023
స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ వున్న టైమ్‌లో చిన్న సినిమాలు రిలీజ్ చేయడం సాహసంతో కూడుకున్న పనే అవుతుంది. అందులోనూ ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడంతో థియేటర్లన్నీ వాటికే కేటాయించే అవకాశం ఉంది. అంతేకాదు ప్రేక్షకులు సైతం ఆ సినిమాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుతం రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాలు డిసెంబర్ 22న ప్రభాస్ సలార్, డిసెంబర్ 21న షారూక్ ఖాన్ డంకీ. దాంతో ఈ శుక్రవారం పెద్ద హీరోల సినిమాలేవీ రిలీజ్‌కి రాలేదు. అయినప్పటికీ వారం రోజుల రన్ కోసం ఇప్పుడు 10 సినిమాలు రెడీ అయ్యాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే పది సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయంటే చిన్న సినిమాల రిలీజ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రిలీజ్ అవుతున్న ఈ పది సినిమాల్లో కాస్తో కూస్తో బజ్ ఉన్న సినిమా పిండం. ఎందుకంటే హారర్ కంటెంట్ కావడంతో ఒక వర్గం ప్రేక్షకులు ఆ సినిమాలను ఇష్టపడతారు. అందువల్ల కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా కొంత బెటర్‌గానే ఉండే అవకాశం ఉంది. ప్రమోషన్స్ కూడా బాగానే చెయ్యడం వల్ల థియేటర్లు కూడా ఈ సినిమాకి బాగానే దొరికాయి. ఈ సినిమాతోపాటు ఆలంబన, దళారి, కలశ, తికమక తండ, శంతల, సఖి, చే లాంగ్ లివ్, మాయలో చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏ సినిమాకీ బజ్ లేదు. క్యాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. దాంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాలు రిజిస్టర్ అవ్వలేదు. ఏది ఏమైనా ఈ పది సినిమాలకు వున్న టైమ్ వారం రోజులు మాత్రమే. సినిమా బాగుందని టాక్ వచ్చినా, కలెక్షన్లు కూడా బాగానే ఉన్నా సలార్ వచ్చేసరికి అందరూ దానికి తలవంచాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



