ప్రియాంకకు తల్లిగా చేయదంట...!
on Mar 14, 2014

ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ "దిల్ ధడక్నే దో" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియాంకకు తల్లిపాత్రలో నటించమని నటి టబుని సంప్రదించారట. ప్రియాంక, టబుల మధ్య పదేళ్ళ వయసు తేడా ఉంది. కానీ ఇప్పుడే తల్లి పాత్రలకు చేస్తే ఇక భవిష్యత్తులో తనకు ఎలాంటి సరైన ఆఫర్లు రావని భావించిందని.. అందుకే ఈ ఆఫర్ ను టబు ఒప్పుకోలేదని తెలిసింది. కానీ ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



